ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుక

హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  ఆదేశాల మేరకు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను గోవిందపురం ఎనిమిదవ వార్డు  కౌన్సిలర్ చిలక బత్తిని సౌజన్య  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. మంగళవారం ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, టిఆర్ఎస్  పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి పాల్గొని అంబేద్కర్  విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎస్సై,  కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నవారికి చిలక బత్తిని ధనుంజయ ఎస్ఐ ఆఫ్ పోలీస్ సహకారంతో కోడిగుడ్ల పంపిణీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్స్ బోల్లెద్దు ధనమ్మ జైలు, ములకలపల్లి రామ్ గోపి, అమరబోయిన సతీష్,  అంగన్వాడీ టీచర్స్ సిహెచ్ శాంత, ఇట్టిమల్ల తిరపమ్మ, ఆశా వర్కర్స్ బండి జ్యోతి, తెలగమల్ల సావిత్రి, 8వ వార్డు అధ్యక్షులు పాలడుగు రాజు, 9 వ వార్డు ఇన్చార్జి ఇట్టి మల్ల మధు, బండి భాస్కర్, రెంటాల కోటి, గొర్రె వీరబాబు, దగ్గుపాటి దీవెన కుమార్, ఆసోదు శ్రీను,  మేడం పెద్దలక్ష్మీనరసి, పోతుల జ్ఞానయ్య,  జెట్టి ప్రసాద్, జెక్కి భాస్కర్, దార్ల వెంకటేశ్వర్లు, ఉండేటి బెనర్జీ, తుమ్మ కొమ్మ అరుణ్, పాలడుగు కోటయ్య, దాసరినరేంద్ర, గొట్టేముక్కల రాములు, దాసరి పున్నయ్య,  గోవిందపురం యువతీ, యువకులు    పాల్గొన్నారు.