ఘనంగా డైరెక్టర్ సప్తగిరి గౌడ్ జన్మదిన వేడుకలు. జనహృదయ యువనేత సప్తగిరి గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు. తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్.

తాండూరు జూన్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్తగిరి గౌడ్  జన్మదిన వేడుకలు శనివారం  మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ , వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి ,డైరెక్టర్లు ఆశన్న,మల్లప్ప,ప్రవీణ్ గౌడ్,వికారాబాద్ జిల్లా కోఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబా , ఎం పి టి సి ప్రభాకర్ , పిఎసిఎస్  డైరెక్టర్ అశోక్ రెడ్డి  , సర్పంచులు దేవనూరు ఆకుల శివ
కుమార్ , రాఘవపూర్ అమర్నాథ్ రెడ్డి , రవికుమార్ , సాయిలు ,శ్రీనివాస్ గౌడ్ , లాలూ ముదిరాజ్ , అజ్మత్ ,వీరందరి సమక్షంలో జనహృదయనేత తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్తగిరి గౌడ్ జన్మదిన వేడుకలు తోటి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా  ఆకాంక్షించారు.