Wednesday, 4 November 2026

ఘనంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం… – హాజరైన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి.

 

బై0సా.రూరల్ జూన్13 జనం సాక్షినిర్మల్ జిల్లా బై0సా పట్టణంలోని స్థానిక ఎన్.ఆర్ గార్డెన్లో బై0సా డివిజన్ వ్యాప్త0గా వున్నా అంగన్వాడి సంబంధిత అధికారులు, కేంద్రల సిబ్బంది,మహిళలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్త్రీ,శిశుసంక్షేమ శాఖ అభివృద్ధి కోస0 పాటుపడుతుందని అన్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా కి 130 అంగన్వాడి కేంద్రాలు మంజూరయ్యాయని, దాంట్లో 50 పైగా తాలూకాకి రానున్నయని తెలిపారు. పక్క రాష్ట్రాలు సైతం మన పథకాలు చూసి ఆశ్చర్యపోతున్నాయంటూ అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో సుధీర్, బై0సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సాగర రాజన్న ,ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, కుబీర్ జెడ్పిటిసి అల్కత్తాయి, భైంసా ఎంపిటిసి రజాక్, ముధోల్ సిడిపిఓ శ్రీమతి, భైంసా ఇన్చార్జి సిడిపిఓ నాగలక్ష్మి బి.అర్.ఎస్ నాయకులు, ప్రజాపతినిధులు, అంగన్వాడి,ఐ.కె.పి సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.