బై0సా. రూరల్ జూన్ 13 జనం సాక్షిబాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పియుసి-1 చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని బాత్రూంకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడింది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….వడ్ల దీపిక, గొర్రెకల్ వడ్లపల్లి, సంగరెడ్డి జిల్లా వాసి వార్షిక పరీక్షల అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి, భద్రతా సిబ్బంది చూసేసరికి చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు విద్యార్థిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విద్యార్థిని దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది తదితరులు చింతిస్తున్నామని తెలిపారు.
బాసర త్రిబుల్ ఐటీ లో విషాదం…




