ఏటూరు నాగారం (జనం సాక్షి):జూన్:13మహిళ అనేది భావితరానికి స్ఫూర్తి అని, ఆరోగ్యంబాగా ఉంటేనే గమ్యం చేరగలమని, మహిళల సంక్షేమంపై అమలవుతున్న పథకాలు చాలా బాగున్నాయని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.మంగళవారం ఏటూరునాగారం లోని శ్రీనివాస బన్ను హాస్పటల్, బస్టాండ్ వద్ద గల శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్
ఇలా త్రిపాఠి, ఏఎస్పీ సంకీర్త్, కో ఆప్షన్ మెంబర్ వలియా బీ లతో కలిసి పాల్గొన్నారు.తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అదనపు కలెక్టర్, ఏ ఎస్ పి, ప్రజా ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్, ఏ ఎస్పీ,ప్రజా ప్రతినిధులు, అధికారులు, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు జీవిత కాలంలో ప్రతి దశలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు.ఆరోగ్య లక్ష్మి పథకం అమలులో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పాలు, గుడ్డుతో పౌష్టికాహారం అందించడంతో పాటు, పుట్టిన పిల్లలు ఎదుగుదలకు బాలామృతం ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు.మహిళల పెళ్లి ఖర్చులు భరిస్తూ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. గర్భిణీ స్త్రీలలో రక్త హినత తొలగించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని,2 వేల విలువ చేసే న్యూట్రిషన్ కిట్లను ప్రతి గర్భిణీ స్త్రీకి రెండుసార్లు అందించడం జరుగుతుందని అన్నారు.ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు, పిల్లలకు బాలామృతం అందిస్తూ వారి ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, పేద మహిళలకు మగ పిల్లవాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలు సహాయం అందిస్తూ 16 వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నామని అన్నారు.ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కుల, మతాలకతీతంగా కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ కింద ఒక లక్షా 116 సహాయం అందిస్తున్నదని తెలిపారు.మహిళల అభివృద్ధి కోసం ప్రతి దశలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం అర్హులకు పారదర్శకంగా అందిస్తుందని, పథకాలను మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఏఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి , ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ద్వారా నిరంతర నిఘా పెట్టిందని అన్నారు. మహిళల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
కో ఆప్షన్ మెంబర్ వలియ బీ మహిళా సంక్షేమం కోసం
గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వాల హయంలో అంగన్వాడి కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని తెలిపారు. దేశంలోనే అంగన్వాడి కార్యకర్తలకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాధించిన విజయాలు ఘనంగా చాటాలని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం స్వశక్తి మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది మహిళా సంక్షేమ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలపై వీడియో ప్రదర్శన
ప్రదర్శన చేయనై నది
అనంతరం మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించినారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది మహిళా సంక్షేమ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా
బస్టాండ్ వద్ద ఐటి డిఎ పి ఓ అంకిత్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అంతటి విజయ, శ్రీనివాస్ రెడ్డి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, డి డబ్ల్యుఓ ప్రేమలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డి సి ఓ సర్దార్ సింగ్, ఎల్డియం రాజ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి,ఎంపీడీవోలు, ఎంపీలు, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ,ఆర్ డి ఐ కే పి నుండి మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలు, ఐసిపిఎస్, చైల్డ్ లైన్, సఖి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




