Monday, 2 November 2026

ఘనంగా తొలి ఏకాదశి.. శివ అభిషేకంలో పాల్గొన్న డి.ఎస్.పి వెంకట రమణమూర్తి..

ఇల్లందు 29 జూన్ (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక జెకె కాలనీ లో గలహరిహర క్షేత్రంలో తొలి ఏకాదశినీ పురస్కరించుకొని ఇల్లందు డి.ఎస్.పి వెంకట రమణమూర్తి శివాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ గురువారం రోజు శ్రీ హరిహర క్షేత్రం లో తొలి ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన ఇల్లందు డి.ఎస్.పివెంకట రమణమూర్తి ఆలయాలను సందర్శించారు. వారికి ఆలయ ఛైర్మెన్ లోద్ కృష్ణ మరియు నిర్వహణాధికారి బీమావరపు సూర్యప్రకాష్, ప్రత్యేక పూజలు చేపించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ సిబంది పెద్దినేని రామకృష్ణ, ఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు