Wednesday, 4 November 2026

ఘనంగా తోషం గ్రామస్తులు పోచమ్మకు సామూహిక బోనాలు

 

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్ ఫిబ్రవరి( 12 జనం సాక్షి)మండలంలోని తోషం గ్రామానికి చెందిన నేతకాని కులస్తులు ఆదివారం పోచమ్మ దేవతకు సామూహిక నైవేద్యాలు,బోనాలు సమర్పించారు. మాఘ మాసంలో వచ్చే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ కులదైవమైన రాజరాజేశ్వర స్వామిని స్మరించుకుంటూ ప్రతి యేట పోచమ్మకు నైవేద్యాలు, బోనాలు సమర్పించడం అనవాయితీ. అందులో భాగంగా ఆదివారం గ్రామంలోని 73 నేతకాని కుటుంబాల మహిళలు బోనాలను తయారు చేసిన కుండలు తలపైపెట్టుకుని ఊరేగింపుగా పొచ్చమ్మ ఆలయానికి వెళ్లి సామూహికంగా బోనాలు సమర్పించారు.కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని,పాడిపంటలు సమృద్దిగా పండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కుల పెద్ద బండారి దేవిదాస్,కోలకాడ్ కామెరి గోపాల్,కులస్థులు జాడి సుదర్శన్,జునుగురు రాజేశ్వర్, జాడి రవీందర్, జునుగురు మహేష్, జాడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు