మెట్పల్లి, ఫిబ్రవరి 12, జనంసాక్షి:
మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్ పల్లి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు, ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సిహెచ్ సుభాష్ కుమార్ ఎండి వేంపేట గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందించారు, అనంతరం మందులు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ బింగి రామ్మోహన్ మాజీ ఎంపీటీసీ సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్, ఆర్.ఎం.పి పి.ఎం.పి జిల్లా గౌరవ అధ్యక్షులు గాజంగి రాజ మల్లయ్య, ముత్యం రెడ్డి, కొమురయ్య, పిటి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు




