Wednesday, 4 November 2026

జంగిలి పెద్దరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సౌత్ ఇండియన్ టూర్ చిట్టి సభ్యులు, తోటి మిత్రులు.

జంగిలి పెద్దరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సౌత్ ఇండియన్ టూర్ చిట్టి సభ్యులు, తోటి మిత్రులు.

జనం సాక్షి, చెన్నరావు పేట

మండల కేంద్రంలోని లింగగిరి గ్రామంలో గత వారం రోజుల క్రితం హత్యకు గురై మరణించిన జంగిలి పెద్దరాజు కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ మాదారపు భాస్కర్, సౌత్ ఇండియన్ టూర్ చిట్టి సభ్యులు, తోటి మిత్రులు కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్నివేళల, ఆపద సమయంలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 20,000/- రూ ఆర్థికంగా సహయం చేశారు. వారి కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోయామని తల్లి, పిల్లలు కన్నీరు మున్నీరు అయ్యారు. అందుకుగాను మా వంతు సహాయంగా ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకుంటామని తోటి మిత్రులు చెప్పడం జరిగింది. ఈ సాయం అందించినందుకు గాను కుటుంబ సభ్యులు తోటి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మాదారపు భాస్కర్, సూరిపల్లి పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్లు మల్లం సాగర్, నాంపల్లి శ్రీనివాస్, చిట్టి సభ్యులు, తోటి మిత్రులు సప్పిడి శ్యామ్, బూరుగు సుధాకర్, వేముల రవికుమార్,కుసుమ శ్రీనివాస్, సతీష్, కుమారస్వామి, శ్రీకాంత్, దాసరి అశోక్, కుక్కల అశోక్, సాధబోయిన అశోక్, మల్లం రమేష్, పంతంగి రమేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.