జనం సాక్షి /కొల్చారం మండల వ్యాప్తంగా జోరుగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని అంసాన్ పల్లి, వెంకటాపూర్, కొల్చారం, కిష్టాపూర్, రాంపూర్ పోతంశెట్టిపల్లి గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మరోవైపు కొల్చారం జాతీయ రహదారి పక్కన ధాబాలలో హోటలలో మద్యం సిట్టింగులు ఏర్పాటు చేయడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కొల్చారం పోలీసులకు ఎక్సైజ్ సిబ్బందికి పిర్యాదు చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. గ్రామాలలో బెల్ట్ షాపులో ఏర్పాటు వల్ల తరచూ గ్రామాల్లో మద్యం తాగిన వ్యక్తుల వల్ల గొడవలు జరుగుతున్నాయి. మద్యం మస్తులో చోరీలకు వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు బెల్ట్ షాప్ లు తొలగించాలని ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల యువకులు చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో బెల్ట్ షాపు తొలగించి రోడ్డుపై, హోటలలో మద్యం సిట్టింగ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రూల్స్ గీల్స్ జాంతా నై…?? రోడ్లపైనే సెట్టింగ్..? ప్రభుత్వ రూల్స్ ను పక్కన పెట్టిన దుర్గా వైన్స్ యజమాన్యం రోడ్లపైనే కూర్చొని తాగుతున్న మందుబాబులు పట్టించుకోని కొల్చారం పోలీసులు




