Wednesday, 4 November 2026

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

బోయిన్ పల్లి జనవరి 23 (జనంసాక్షి)బోయిన్ పల్లి మండల కేంద్రం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతాజీ దేశం కోసం ఎంతో గొప్ప త్యాగం చేశారు అని పేర్కొన్నారు.నేతాజీ సేవలు దేశ ప్రజలకు ఎంతో గాను ఉపయోగ పడ్డాయి అని పేర్కొన్నారు.నేతాజీ మహనీయుడు అని కొనియాడా. ఈ కార్యక్రమం లో ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అతికం రాజ శేఖర్ గౌడ్,బీజేపీ మండల అద్యక్షులు గుడి రవీందర్ రెడ్డి,దళిత సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం తిరుపతి, బీఎస్పీ నియోజక వర్గ అధ్యక్షులు మహంకాళి తిరుపతి,జర్నలిస్ట్ నాయకులు గజ్జెల శ్రీనివాస్,పెంతల సంపత్, కూస రవి ఏ ఐ ఎస్ చొప్పదండి నియోజక వర్గ అద్యక్షులు పొత్తూరి సురేష్ బాబు,వంశీ,వేణు,బీజేపీ నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, కొండము శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు గంగి పల్లి లచ్చయ్యా తదితరులు పాల్గొన్నారు.