Wednesday, 4 November 2026

నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ పోచారం రాక.

 

ఎల్లారెడ్డి 23 జనవరి (జనం సాక్షి ) ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధి గా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు ఎల్లారెడ్డి మండల అధికార ప్రతినిధి చింతల శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆయన మాట్లాడుతూ గతంలో నాగిరెడ్డిపేట మండలం నుండి చైర్ పర్సన్ గా బోయిని రాధా విట్టల్ ఉండి రైతులకు ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలు చేపట్టి రైతులకు పూర్తి సహకారాలు ఎమ్మెల్యే జజాల అండదండలతో నెరవేర్చారు పదవి కాలం ముగిసి ఆరు నెలలు గడిచిన అనంతరం నూతన చైర్మన్గా నాగిరెడ్డిపేట మండలం నుండి మాజీ జడ్పిటిసి కాశీ నారాయణ ను ఎల్లారెడ్డి నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ నియమించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు ఎల్లారెడ్డి అధికార ప్రతినిధి చింతల శంకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల ప్రజా ప్రతినిధులు రైతు నాయకులు అధికారులు హాజరుకావాలని కోరారు మార్కెట్ కమిటీ చేర్మన్ గా కాశి నారాయణ ప్రమాణస్వీకారం ను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు