Wednesday, 4 November 2026

ఘనంగా వాసవిమాత ఆత్మార్పణం

మెట్ పల్లి టౌన్, జనవరి23,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో సోమవారం వాసవిమాత ఆత్మార్పణం దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా పురోహితులు భాస్కర్ శర్మ, బాలకృష్ణ శర్మ,కృష్ణ ప్రసాద్ శర్మ లు పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశనం, స్థాపితదేవతార్చన, అభిషేకం, కుంకుమార్చన, చండీహోమం,పూర్ణాహుతి,మంగళహారతి,మంత్రపుష్పము, బుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట సుమన్, కార్యదర్శి ముక్క పవన్, కోశాధికారి ర్యాగెల శ్రీనివాస్, వాసవి దేవాలయ అధ్యక్షులు వెలగందుల తిరుపతి, చిలమంతుల శివ,బండారి మారుతి, అధిక సంఖ్యలో మహిళలు,భక్తులు పాల్గొన్నారు.