Thursday, 5 November 2026

సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి

సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
జనవిజ్ఞాన వేదిక సైన్స్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జిల్లా జనవిజ్ఞాన వేదిక సైన్స్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు.విజ్ఞానాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.విద్యార్థుల్లో సైన్స్ దృక్పథాన్ని పెంపొందిస్తూ రేపటి తరానికి మంచి భవిష్యత్ ను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు , రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాం ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరాజు , పీవీ దుర్గాప్రసాద్, మారం నారాయణరెడ్డి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వల్లపట్ల దయానంద్, గుండా రమేష్ , సభ్యులు జక్కుల వెంకటేశ్వర్లు, కలకుంట్ల సైదులు, మాడుగుల జార్జ్, వనమాల శ్రీనివాస్,  సూర్యనారాయణ, యలమద్ది అశోక్ కుమార్, లక్ష్మీ కోటేశ్వరరావు,  సొల్లేటి ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.