బాల్కొండ లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ యువకుడు
బాల్కొండ జనవరి 9 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గంజాయి అమ్మడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్నారని పక్క సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయిస్తున్న మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన పలనాటి దిలీప్ (20)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలనాటి దిలీప్ వద్ద నుండి 400 గ్రాములు ఎండు గంజాయిని ఒక స్కూటీని స్వాధీనపరుచుకున్నారు.మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని బాల్కొండ ఎస్సై కే.గోపి తెలిపారు.




