ఘనంగా పార ఉదయ్ జన్మదిన వేడుకలు
ఖమ్మం అర్బన్,డిసెంబర్ 26 (జనంసాక్షి) “హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ది పీపుల్” స్వచ్చంద సంస్థ చైర్మన్ పార ఉదయ్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ డివిజన్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో ఉదయ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ కమర్తపు మురళి ముఖ్య అతిథులుగా విచ్చేసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఉదయ్ రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి శరత్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరావు, నాయకులు మాడురి సైదారావు, మాటేటి కిరణ్, పారా సత్యం, హెల్పింగ్ హార్ట్స్ కో ఆర్డినెటర్లు పాల్గొన్నారు.
ఘనంగా పార ఉదయ్ జన్మదిన వేడుకలు




