మండల స్థాయి కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు అందజేత
మల్దకల్ డిసెంబర్ 26(జనం సాక్షి)మండల కేంద్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రామ యూత్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి.ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి దాతలు సర్పంచ్ యాకోబు,టిఆర్ఎస్ నాయకుడు అమృత్ కుమార్ 10,016 బిజ్వారం టీముకు అందజేశారు.రెండో బహుమతి వార్డు మెంబర్లు వీరన్న, బద్రి 6016 కురువ రమేష్ టీముకు అందజేశారు.మూడో బహుమతి దాత మోహన్ రాజు 3016 అశోక్ టీం,అందజేశారు.షీల్డ్ దాత రాజ్ కుమార్ అందజేశారు. బహుమతులను గ్రామ సర్పంచ్ యాకోబు,టీఆర్ఎస్ నాయకుడు అమృత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




