Saturday, 7 November 2026

వినియోగదారుల మన్ననలు పొందాలి

వినియోగదారుల మన్ననలు పొందాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) :వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి వస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని 29వ వార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ సీ స్పైసీ ఫుడ్ కోర్ట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పెద్ద నగరాలకే పరిమితమైన కార్పొరేట్ సంస్థలు , షాపింగ్ మాల్స్ , ఫుడ్ కోర్ట్ లను నేడు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రుచి , నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ , నాయకులు బైర్ వెంకన్న గౌడ్ , బైరు దుర్గయ్య గౌడ్ , టేకుల సులోదర్ , షాప్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.