పూర్వ విద్యార్థుల క్రికెట్ మ్యాచ్
వేములవాడ, డిసెంబర్ 4 (జనం సాక్షి): 1998-99 పదవ తరగతికి చెందిన జవహర్లాల్ నెహ్రూ, గీత పాఠశాలల పూర్వ విద్యార్థుల క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఆహ్లాదకరంగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గీతా విద్యాలయం బ్యాచ్ 12 ఓవర్లలో 85 పరుగులు చేయగా తొమ్మిది ఓవర్లలో 86 పరుగులు చేసి జవహర్లాల్ నెహ్రూ బ్యాచ్ విజేతగా నిలిచింది. 49 పరుగులు చేసి సాయిని అనిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఉద్యోగరీత్యా వివిధ స్థాయిలో స్థిరపడి 24 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులతో ఆడడం సంతోషంగా ఉందని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
పూర్వ విద్యార్థుల క్రికెట్ మ్యాచ్




