శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి :మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లో గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా గుండ్లపల్లి, దొంతి, మగ్దంపూర్, శభాష్ పల్లి, పాంబండ గ్రామాల ముస్లిం సోదరులు దొంతి ఈద్గా వద్ద మత గురువు ఆధ్వర్యంలో అలాగే నవాబుపేట దర్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. గూడూరు ఈద్గా వద్ద శివ్వంపేట, గూడూరు గ్రామాల ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు లాయక్, యూత్ నాయకులు షేక్ అలీ, మాజీ మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు సయ్యద్ దావూద్, నేవీ కళాశాల అధినేత అఖిల్ అహ్మద్ లతోపాటు ఆయా గ్రామాల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు




