దగుడిహత్నూర్: ఫిబ్రవరి 5( జనం సాక్షి) సంస్కరణవాది భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ 116 జయంతిని మండల కేంద్రంలోని బస్టాండ్ లో దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు గంగయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరాని వారికి సమానత్వం సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. నవ భారత నిర్మాణానికి ఆయన ఆలు పెరగని కృషి చేశారని పేర్కొన్నారు.ఆయన జీవితం మన అందరికి ఆదర్శం అన్నారు. జీవితంలో ఆయన ఎన్నో ఓడిదడుకులకు ఎదుర్కొని సమాజంలోని అణ గారిన వర్గాల కోసం పోరాడారన్నారు.బాబు జగ్జీవన్ రామ్ జయంతి,వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ మండల కన్వీనర్ కర్రాడ్ బ్రహ్మానంద్,నాయకులు కొల్లూరి వినోద్,లక్ష్మణ్,సుంకే రమేష్, సుద్దాల రాజు, కల్లేపల్లి ప్రేమ్ రాజ్, దోమకొండ సుధాకర్, గాయ్కాంమ్లే మారుతి, ఫడ్ దిలీప్, సలింఖాన్,ధమానంద్ తదితరులు పాల్గొన్నారు.




