భువనగిరి టౌన్ (జనం సాక్షి):–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా విగ్రహానికి 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో 1908 ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జన్మించడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ పాఠశాల విద్య అభ్యాసం చేసేటప్పుడే కుల వివక్ష ఎదుర్కొన్నారు ఆయన చదువుతున్న పాఠశాలలో మంచినీళ్లు తాగే విధానంలో పాఠశాల ఆవరణలో రెండు మంచినీటి కుండలు చూసి ఆశ్చర్యపోయాడు ఒక్క కుండ హిందువులు కు మరొక కుండ ముస్లింలు కు ఏర్పాటు చేయడంతో జగ్జీవన్ రామ్ హిందువుల కుండ నుండి నీళ్లు తాగితే అంటరాని తరగతి చెందిన వాడు అని జగ్గజీవన్ రామ్ గారిని మంచినీళ్లు తాగనీయలేదు అప్పుడు జగ్జీవన్ రామ్ గారు పాఠశాల ఆవరణ రెండు కుండలతో పాటు మూడవ కుండా ను ఏర్పాటు చేసిన ధైర్యవంతుడు,1937లో బీహార్ రాష్ట్ర శాసనసభకు మొట్టమొదటిసారిగా ఎన్నికై మంచినీటి బావుల కోసం అనేక ఉద్యమాలు చేసి కుల వివక్షత మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, గొప్ప రాజకీయ వేత, బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బాబు జగజ్జివన్ రావు గారు భారత పార్లమెంటు సభ్యునిగా 40 సంవత్సరాల పాటు ఉండి వివిధ కేంద్ర మంత్రి పదవులు నిర్వహించి భారత దేశానికి 4వ ఉప ప్రధాని గా కూడా కొనసాగాడు,రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, తంతి తపాల శాఖ మంత్రిగా ఉండి ఆశాఖలలో అనేక పెను మార్పులు తీసుకొచ్చి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ శాఖలు అభివృద్ధి చెంది ఉన్నాయంటే ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ వేసిన బీజాలే అలాంటి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం మనమందరం కంకణ బద్ధులవుదాం.




