Friday, 6 November 2026

డబుల్ బెడ్రూంలను పరిశీలించిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్

డబుల్ బెడ్రూంలను పరిశీలించిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్

తిమ్మాపూర్, నవంబర్ 14 (జనం సాక్షి): మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఈరోజు వేకువ జామున గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ గ్రామాభివృద్ధిపై చర్చిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అతిత్వరలో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే డా.రసమయి తెలిపారు. ఆయన వెంట మండల నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గుండ్ర రాజయ్య, రాజు, శ్రీనివాస్ లతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.