ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కొడకండ్ల, నవంబర్14 ( జనంసాక్షి ) కొడకండ్ల మండల కేంద్రంలోని మై రెడీమర్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే, పిల్లలే ఉపాధ్యాయులుగా, అధికారులుగా మరి వారి పాత్రలను అద్భుతంగా పోషించారు. ప్రిన్సిపాల్ గా తస్కిన్ జోహా, వైస్ ప్రిన్సిపాల్ గా,యం డి. నబిల్,
జిల్లా కలెక్టర్ గా సఫూరా హదియ, డి ఈ ఓ గా శాస్త్రి హర్షిత, ఎం ఈ ఓ గా బొమ్మెరబోయిన శ్రిహిత్, విద్యాశాఖ మంత్రిగా వీరగోని హర్షిత్ గౌడ్, మెడికల్ ఆఫీసర్ గా పడమటింటి అమూల్య, అటెండర్స్ గా ఇడబోయిన సిద్దు, అక్షయ్, పి ఈ టి లుగా, మనోజ్, ధరావత్ దినేష్, తెలుగు టీచర్ గా బత్తుల సంజన, ఇంగ్లీష్ టీచర్ గా తుమ్మ ఉపేక్ష్, హిందీ టీచర్ గాఎండీ. ముబీన్, ఈవియస్ టీచర్ గా సాయి రిత్విక్, నర్సరీ టీచర్స్ గా జాటోత్. నవ్య శ్రీ, మరాఠీ. అంజలి, ఎల్ కె జి టీచర్స్ గా ఈరిటి అక్షిత తమ యొక్క పాత్రలను అద్భుతంగా పోషించారు, అనంతరం ఫ్యాషన్ షో నీ నిర్వహించడం జరిగింది. అందులో పిల్లలు చక్కని కాస్ట్యూమ్ డ్రెస్సెస్, ఫాన్సీ డ్రస్సులు వేసుకొచ్చారు, మరికొందరు స్పెషల్ డ్రెస్సెస్ లు వేసుకొని రావడం సభా ప్రాంగణంలో ఆకర్షణీయంగాకనిపించారు.అనంతరం ఉపాధ్యాయులు పిల్లల కోసం చక్కని భహుమతులు, చాక్లెట్స్, స్వీట్స్, పెన్సిల్స్ తీసుకొచ్చి క్లాస్ వైస్ గా ఒక్కక్కరికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్కూల్ పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపాల్ పెదపూడి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.




