Monday, 2 November 2026

ఘనంగా బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ పెళ్లిరోజు

మునిపల్లి, జూన్ 01, జనంసాక్షి : మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు చాకలి మల్లికార్జున్ ( చిట్టి ), లక్ష్మీ దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి గ్రామంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, గ్రామ యువకుల మధ్య ఘనంగా జరిగింది. గ్రామస్తులు కేక్ కట్ చేసి మల్లికార్జున్, లక్ష్మీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు డిదిగే పాండు, వజీర్, నరేష్, నర్సింలు, తుక్కన్న, చెంద్రయ్య స్వామి, సాబెర్ పాషా, నబిసాబ్, తుక్కారం, దన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.