Wednesday, 4 November 2026

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

 

 

 

 

 

వేమనపల్లి ఏప్రిల్ 6 (జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.