
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 5జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.బుధవారం నేరేడ్ మెట్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం వెనకాల సర్వేనెంబర్ 278లో మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నూతన భవనానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత దశాబ్దాల కాలంగా మల్కాజిగిరి మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడంతో వారి నిరంతర కార్యకలాపాలకు ఇబ్బందులు జరుగుతున్నాయని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం అందరి సహకారం అందిస్తామని తెలిపారు. వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జీఎన్ వి సతీష్ కుమార్ ను నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.ఎమ్మెల్యే సహకారానికి జర్నలిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు.ఎంతోకాలంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని మైనంపల్లి సహకారంతో తమ చిరకాల కోరిక నెరవేరడంతో ఎమ్మెల్యే మైనం పల్లి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో నక్క ప్రభాకర్ గౌడ్,కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రాము యాదవ్, నాయకులు ఉపేందర్ రెడ్డి,రాము యా దవ్,గూండా నిరంజన్,జిఎన్వి సతీష్ కుమార్,పిట్టల శ్రీనివాస్,ప్రసాద్,బుజ్జి,సురేష్,నర్సింగ్ ,ఆగమయ్య,బాలకృష్ణ, ప్రింట్ ఎలక్ట్రనిక్ మీడియా విలేకర్లు పాల్గొన్నారు.




