జుక్కల్, జూన్ 29, (జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పడంపల్లి గ్రామంలో తమిళనాడు బిజేపి జనరల్ సెక్రటరీ ఉషారాణి అధ్వర్యంలో గురువారం బిజేపి నాయకులు మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. బిజేపి కార్యకర్తలు ,నాయకులు ప్రతిభూత్ ను పటిష్టంగా తయారు చేయాలని సూచించారు. ప్రజలు భారతీయ జనతాపార్టీ లో చేరాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల్ సీనియర్ నాయకులు ప్రశాంత్ పటేల్ ,జుక్కల్ మండల్ అధ్యక్షులు శివాజీ పటేల్ ,జనరల్ సెక్రటరీ పవన్ , సంతోష్ రెడ్డి,గంగాధర్ వినాయక్ సాయికుమార్ ,సుభాష్ , సంగ్రాం తదితరులు పాల్గొన్నారు.
పడంపల్లిలో మేరా బూత్ సబ్సే మజ్బూత్




