ఘనంగా బ్రూస్ లీ జయంతి వేడుకలు…
– పైట్ మాస్టర్ మాతంగి ప్రవీణ్
హన్మకొండ బ్యూరో చీఫ్ 27 జనంసాక్షి
బాల్యం నుంచి యుద్దవిద్యల పై సాధన చేసి ప్రపంచ ప్రఖ్యత గాంచేరు. ఈయన ఫిలాసఫర్, ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు అని అన్నారు.అంది అపూహ కాని బ్రూస్ లీ అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడునని అభిప్రయా పడేవారుఅని తెలిపారు.వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. వస్తువుకు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షరసత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు అని అన్నారు.




