డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు…. వనపర్తి బ్యూరో నవంబర్ 26 ( జనం సాక్షి ) వనపర్తి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా వేడుకలు జరిగాయి. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకుంటారని, జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ భాష సూచించారు. శనివారం ఐ.సి.డి.ఓ కార్యాలయం ప్రాంగణంలో రాజ్యంగ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని, జిల్లా అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. తాను రచించిన భారత రాజ్యాంగంలో హక్కులు, విధులు, బాధ్యతలు తూ.చా తప్పకుండా పాటించడం ద్వారా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, రూపొందిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజ్యాంగాన్ని 1954 నవంబర్ 26న తేదీన ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. భారతదేశం ప్రజలమైన మేము సార్వభౌమ,సామ్యవాదం, లౌకికవాదం, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పినందుకు పౌరులందరికీ సామాజిక , ఆర్థిక రాజకీయ, భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యత, వ్యక్తి, సౌబ్రత్వానికి అందించడానికి మనం మనంగా రూపొందించుకున్న భారత రాజ్యాంగ దినోత్సవం,సత్య నిష్టచేస్తున్నట్లు జిల్లా అధికారుల సిబ్బందిచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్పదనాన్ని, సేవలను హక్కులను, విధులను, బాధ్యతలు, తూ.చా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ డివిజన్ వేణుగోపాల్ , జిల్లా సిబ్బంది అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.




