Thursday, 5 November 2026

భారతదేశానికి వన్నెతెచ్చిన మహనీయులు జ్యోతిబాపూలేఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

–

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : భారతదేశానికి వన్నెతెచ్చిన మహనీయులు జ్యోతిబా పూలే అని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీధర్ బాబు హాజరై జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి వన్నెతెచ్చిన మహనీయులు జ్యోతిబాపూలే అని, కాంగ్రెస్ పార్టీ హయాంలో మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి..ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటి మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ముందుండి కరీంనగర్ లో ఆవిష్కరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మహనీయుల ఆలోచనలను ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తాం అన్నారు. జ్యోతిబాపూలే ఆలోచన మేరకు గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు.