Thursday, 5 November 2026

 ఎమ్మెల్యే చిన్నయ్యను అరెస్ట్ చేయాలి  ఎమ్మెల్యే చిన్నయ్యను అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యేపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

@ ఓరిజిన్ డెయిరీ రైతులకు పరిహారం ఇవ్వాలి @ బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గ  ఇంఛార్జి కొయ్యల ఏమాజి డిమాండ్
ఓరిజిన్ డెయిరీ నిర్వాహకులు శేజాల్ తో పాటు మహిళలను వేధించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అత్యాచారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయాలనీ బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య పై చర్య తీసుకోవాలని, ఓరిజిన్ వ్యవహారం పై విచారణ జరిపించాలని బిజెపి బెల్లంపల్లి నియోజక వర్గం ఇంఛార్జి కొయ్యల ఏమాజి తో పాటు బిజెపి నాయకులు జిల్లా కలెక్టర్ సంతోష్ నాయక్ కు ఫిర్యాదు చేసి,  వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఏమాజి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిన్నయ్య తన వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళలను లొంగ దీసుకొని శారీరకంగా వాడుకుంటున్నారని అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు.  ప్రస్తుతం ఒరిజిన్ డైరీ నిర్వాహకురాలు శేజల్ అనే యువతినీ వేదించినట్లు తెలిపారు.  దీనిపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలనీ, సుమోటో గా కేసు నమోదు చేయాలి అని ఏమాజి డిమాండ్ చేశారు.. బాధితురాలికి  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుండి ప్రాణ హాని ఉన్నదని తెలిపారు. ఆమెకు మహిళా కమిషన్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కంప్లైంట్ తీసుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే పి.ఏ భీమగౌడ్ ఆమె ఊరికి వెళ్ళి బెదిరించినట్లు తెలిపారు. పోలీసులు  ఎమ్మెల్యే కు ఏజెంట్లుగా పని చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసులు వెంటనే ఎమ్మెల్యే చిన్నయ్య పై అత్యాచారం, లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేయాలి అని, దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.  మహిళల్ని గౌరవించని ఎమ్మెల్యే ను బీ.ఆర్.ఎస్ నుండీ  ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే పై సిట్టింగ్ జడ్జితో కానీ , సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి తో కానీ విచారణ జరిపించాలని ఏమాజి డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులను వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలక్టర్ ను కలిసిన వారిలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదనరావు, సీనియర్ నాయకులు మున్నారాజా సిసోడియా, విజయ్ కుమార్ ఉన్నారు.