Tuesday, 3 November 2026

ఘనంగా మహాత్మ గాంధీ వర్ధంతి, అమరవీరుల స్మారక దినోత్సవంఘనంగా మహాత్మ గాంధీ వర్ధంతి,

 

 

 

 

అమరవీరుల స్మారక దినోత్సవం నివాళులు అర్పించిన సర్పంచ్ కృష్ణారెడ్డి
భువనగిరి  టౌన్ జనవరి 30(జనం సాక్షి):  జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి వడపర్తి ఎలిమి నేటి కృష్ణారెడ్డి సర్పంచ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుష్టి వ్యాధి దినోత్సవం  ప్రతి గ్రామంలో 15 రోజులు ఖష్టి వ్యాధి అవగాహన సదస్సు ఏర్పాటు  చేయాలి కుష్టి వ్యాధి ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దు కుష్టు వ్యాధిని మందులతో నయం అయ్యే వ్యాధిది ప్రభుత్వము మందులను ఉచితంగా అందిస్తుంది వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నయమై వరకు మందులు ఇస్తారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా చేసుకుని అఖండ భారతావని స్వాతంత్రానికి పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. అదేవిధంగా జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న జాతీయ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భరతమాత విముక్తి కోసం స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో ప్రాణ త్యాగాలను చేశారన్నారు.ఆ త్యాగమూర్తుల త్యాగాలు వృధా కాకుండా త్యాగమూర్తుల జ్ఞాపకార్థం నేడు స్మరించుకోవడం గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి బాలి మేడ బోయిన కృష్ణ మెడబోయిన మల్లేష్ శానూర్ రమేషు రాజు భువనగిరి వెంకటరమణ చారి ,తదితరులు పాల్గొన్నారు.