జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ ను సీయోను ప్రార్థన మందిరం పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ఘనంగా సన్మానించారు. సోమవారం మంథని మున్సిపల్ పరిధిలో ఉన్న సీయోను ప్రార్ధన మందిరంలో ముచ్చటగా మూడోసారి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ మంథనికి అధ్యక్షుడిగా ఎన్నికైన అంకరి కుమార్ ను సీయోను ప్రార్థన మందిరం పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు శాలువాతో సత్కరించి, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంకరి కుమార్ మాట్లాడుతూ.. తనమీద అభిమానంతో సన్మానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.




