Saturday, 7 November 2026

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఎంపీపీ

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 28 జనం సాక్షి న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం మరియు అంటరానితనం, అస్పృశ్యత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మొదలైన సమస్యలపై ఎంతగానో పోరాడి కృషిచేసిన మహానుభావుడు.మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం,కుల వ్యవస్థ, మహిళల పట్ల వివక్ష నిర్ములనకు ఆయన కృషి చేశారని, మహారాష్ట్ర లో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా పూలే ను గుర్తించారని భారత దేశంలో మహిళల విద్యకు మార్గదర్శకులుగా నిలిచిన ఘనత పూలేదన్నారు. సమాజంలో మార్పు రావాలి అంటే ఒక విద్యతోనే సాధ్యమని గ్రహించి జ్యోతిరావు పూలే తన భార్యకు విద్య నేర్పి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఆమె ఎందరో స్త్రీలకు విద్య నేర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే బహుజన బ్రతుకుల్లో వెలుగులు నింపిన ధీరుడు అని వారి సేవలను కొనియాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు