మెట్పల్లి టౌన్, నవంబర్ 28
జనం సాక్షి ,
మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతి*
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 28
జనం సాక్షి:
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు న్యాయవాది పుప్పాల లింబాద్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని వారి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 55 శాతం రిజర్వేషన్లు చట్టసభలలో విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలకు అనుకూలంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల ప్రమోద్, జయంత్, సుమంత్, త్రినాథ్,నిఖిల్, ప్రశాంత్, వాసు, శ్రీకాంత్, చేవెందర్,లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
మెట్పల్లి టౌన్, నవంబర్ 28 జనం సాక్షి ,




