జోగులాంబ అమ్మవారికి బంగారు ఆభరణలు బహుకరుణ అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 28)* దక్షిణ కాశీ అయినటువంటి శ్రీ జోగులాంబ,బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జగన్నాధం మరియు మోహినీ దేవి దంపతులు దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్బంగా వారు బంగారం ఆభరణలు శ్రీ జోగులాంబ అమ్మవారికి సుమారు 10 గ్రాముల బరువు గల రాళ్లతో కూడిన బంగారు బొట్టు బిళ్ళ మరియు నత్తులను విరాళంగా కార్య నిర్వహణ అధికారి పురేందర్ కు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. ఒక లక్ష యాభై ఒక్కవేయి బంగారు ధర రూ.అరవై ఒక్క వేయి రాళ్ల ధర రూ తొంబై వేలు వుంటుందని వారు తెలిపారు.
జోగులాంబ అమ్మవారికి బంగారు ఆభరణలు




