జనంసాక్షి , కమాన్ పూర్ :మహాత్మ జ్యోతిబాపూలే జయంతి 197వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పొన్నం నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నలవెల్లి శంకర్ హాజరై మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిబాపూలే దేశానికి చేసిన సేవలను కొనియాడారు అందరూ మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోలేటి చంద్రశేఖర్ ,జిల్లా కార్యదర్శి కాసరవి మండల ఉపాధ్యక్షులు తోట రాజ్ కుమార్, మెడగొని శ్రీనివాస్, జంగపల్లి లక్ష్మణ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంజపడుగు రవి , బంగారు మహేష్, బైరి సది, భూంపల్లి ఓదెలు, పెద్ద శ్రీనివాస్, గన్నవరపు రవి, గీత గోవిందం శ్రీనివాస్ బంగారు గట్టయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.




