Wednesday, 4 November 2026

మధ్యాహ్నం భోజన కార్మికుల శ్రమను దోచుకుంటున్న .. తెలంగాణ ప్రభుత్వం

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 11తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బండి విద్యార్థులకు పెడుతున్న కార్మికుల శ్రమను తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకుంటున్నాడని, సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమాళ్ళ సమ్మయ్య ఆరోపించారు. శంకరపట్నం మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో శనివారం ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు అధ్యక్షతన , మండలంలోని ప్రభుత్వ పాఠశాలల,మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సమయం మాట్లాడారు. 24/11/2009 లో అప్పటి కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గల మధ్యాహ్న భోజన కార్మికులకు, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనంగా 3 వేలు రూపాయలను అందించాలని ఉత్తర్వులు జారీ చేసిందని, తెలంగాణలోని బి ఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించి మధ్యాహ్నం భోజన కార్మికులకు కేవలం రాష్ట్ర ప్రభుత్వము నుండి 1 వెయ్యి రూపాయలను తన ఇష్టానుసారంగా విడుదల చేస్తూ, 2 వేల రూపాయలను మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడీ చేసి, ప్రభుత్వ పథకాలకు ఇతర సంక్షేమ పథకాలకు వాడుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 3 వేల రూపాయలు అందజేయుటకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని, 2009 నుండి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, 2 వేల రూపాయలను, కూడా కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 8న ఏఐటిసి ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రభుత్వము తలకి తమ పోరాట ఫలితమే 3 వేల రూపాయలు ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల వారిగా బిల్లులు గౌరవ వేతనం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, మండలంలోని వివిధ గ్రామాల మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.