దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు దళిత బంధు తో ఆర్థికంగా ఎదగాలి
జిల్లా సహాయక పాలనాధికారి (శిక్షణ) లెనిన్ వస్టల్ టోపో
వీణవంక జనవరి 5 (జనం సాక్షి ) వీణవంక మండలంలోని చల్లూరు గ్రామపంచాయతి పరిధిలో దళిత బంధు పథకం కింద వచ్చిన దళిత బంధు మొదటి విడత మంజూరైన ఐరన్ బెడ్స్ ఫర్నిచర్ , పెయింట్స్ షాపు, ఆటోమొబైల్ షాప్స్ మొదలగు యూనిట్లను జిల్లా సహాయ పాలనాధికారి లెనిన్ వాస్టల్ టోపో పరిశీలించి వారు మాట్లాడుతూ దళితులు అభివృద్ధి చెందాలని దళితుల కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులు ఉన్నత స్థాయిలో ఉండాలని దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని వారు చెప్పారు మంజూరైన పథకాలను సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా ఎదగాలని పలు సూచనలు చేసినారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సహాయక పాలనాధికారి (శిక్షణ) లెనిన్ వస్టల్ టోపో , ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ .ఎంపిటిసి ఎలవేణి సవిత మల్లయ్య. గ్రామ పంచాయతీ కార్యదర్శి చల్లూరు దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు .




