Thursday, 5 November 2026

ఘనంగా యంజాల్ 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 : శామీర్ పేట్, జనం సాక్షి:జిల్లా పరిషత్ పాఠశాల దేవరయంజాల్ పదవ తరగతి 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆదివారం తూంకుంట మున్సిపాలిటీ దేవరయంజాల్ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుపుకున్నారు. వారికి విద్య అందించిన గురువులను పూలమాల, శాలువాతో సన్మానించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. గురువులు అందించిన విద్య వల్లనే ఈరోజు మేము ఆనందంగా ఉంటున్నామన్నారు.
గురువులు వెంకటరామిరెడ్డి, బాపిరెడ్డి, విజయ్ కుమార్, భీమయ్య, ఉమాదేవి, వసంత లను విద్యార్థులు సన్మానించారు. గురువులు, పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వి.మహేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి, రాజశేఖర్, సరిత, మాధవి, సమత తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -2: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు