Thursday, 5 November 2026

మామిడాలపల్లి లో వైభవంగా ప్రరంభమై బ్రహ్మోత్సవాలు

వీణవంక జనవరి 22 (జనం సాక్షి) వీణవంక మండలంలోని మామిడాల పల్లి లో గ్రామంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి 11వ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండి విష్వక్సేన పూజ పుణ్యాహవాచనము అంకురార్పణ ధ్వజారోహణము అగ్ని ప్రతిష్ట. నిత్య పూర్ణహుతి. ఉత్సవాలు వైభవంగా జరిగినవి దేవునికి ఆరాధించడం వల్ల బాధలు తొలుగుతాయని మనశ్శాంతి కలుగుతుందని రమణాచార్యులు తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో పండితులు నమిలకొండ. రామకృష్ణమాచార్యులు.
భరత్ స్వామి. అరవింద ఆచార్యులు. ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ ఆచార్యులు. దివ్య ప్రబంధం శాస్తిగారు. భరత్ కుమారా చార్యులు.. రామ్ శ్యామ్.. మొదలగు పండితులు ఆలయ అధ్యక్షులు రమణారెడ్డి గ్రామ సర్పంచ్ బండ సుజాత కిషన్ రెడ్డి తోపాటు కార్యనిర్వహకులు సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు 24వ తేదీ మంగళవారం నాడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కళ్యాణం జరుగుతుంది అని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం సేవించి భగవంతుని యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు తెలియపరిచారు