కోటగిరి ఫిబ్రవరి 7 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళ వారం రమాభాయి అంబేద్కర్ జయంతి వేడుకలను దళిత ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా డా.బిఅర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ నినాదాలు చేశారు.తదనంతరం రమాభాయి జయంతి సందర్భం గా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ జయంతి వేడుకలలో దళిత ఐక్య కార్యచరణ సమితి మండల అధ్యక్షుడు మీర్జాపురం సాయన్న,ఉపాధ్యక్షులు కాలే సాయిలు, బ్యాగరి రాములు,కన్నం సాయిలు,దేగం సాయిలు, సుద్దులం సర్పంచ్ గోపు సాయిలు,దౌలయ్య,పాల గంగారం,జీవన్ మోరే,రాము,సైదయ్య,పుప్పాల సాయిలు,తదితరులు పాల్గొన్నారు.




