Tuesday, 3 November 2026

సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించండి

 

 

 

 

*సత్తుపల్లి డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మిపెనుబల్లి, పిబ్రవరీ 7(జనం సాక్షి)
ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తూ ఆర్టీసీని ఆదరించాలని సత్తుపల్లి డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి ప్రయాణికులను కోరారు. మంగళవారం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ జొన్నలగడ్డ లక్ష్మణ్ రావు అధ్యక్షతన జరిగిన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ సంస్థ ప్రజలకు అనేక రాయితీలను అందిస్తుందని, ఉచిత బస్ పాసులు ఒకటి నుండి పదో తరగతి చదివే బాలికలు 18 సంవత్సరాలలోపు వారికి, ఒకటి నుండి ఏడవ తరగతి చదివే బాలురు 12 సంవత్సరాల లోపు వారికి, అదేవిధంగా దివ్యాంగులకు 50% రాయితీతో కూడిన బస్పాసులు, వీటితోపాటు డయాలసిస్ పేషెంట్లకు ఉచితపస్పాసులు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షిత ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలని ఆమె కోరారు. సత్తుపల్లి నుండి తిరుపతికి ప్రతిరోజు మూడు గంటలకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. వారం రోజులు ముందుగా రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకున్న వారికి 300 రూపాయలు అదనంగా చెల్లించినట్లయితే దర్శనం టికెట్లు కూడా అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనెబోయిన నాగేశ్వరరావు, పట్రా కోటయ్య, ఆర్ శ్రీనివాసరావు, ఎం నాగయ్య, పట్రా లక్ష్మి,ఆర్టీసీ సిబ్బంది కిన్నెర. ఆనందరావు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.