మిర్యాలగూడ, జనం సాక్షి.విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంగవీటి వెంకట గురుమూర్తి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ భవనంలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ను ఆయన ప్రారంభించిన అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ వేసవికాలంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. వాసవి క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలను సైతం క్లబ్ రీజియన్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాస్ (డైమండ్) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముందుకు రావడం ప్రశంసనియమన్నారు. జిల్లా స్థాయి చెస్ పోటీలలో ఓపెన్ కేటగిరిలో ప్రథమ స్థానం యు జగదీష్, రెండో స్థానం కే శ్రీనివాస్, మూడో స్థానం శశాంక్ బహుమతులను గెల్చుకోగా బాలికల విభాగంలో మొదటి బహుమతి పి చైతన్య, రెండో బహుమతి శ్రీలత గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ స్పోర్ట్స్ గేమ్స్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ యామ దయాకర్, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ రాచర్ల కమలాకర్,క్యాబినెట్ ట్రెజరర్ రాచకొండ విజయ లక్ష్మి, డైమండ్ గీతా, ఆర్ఇసి మందాలపు శ్రీనివాస్ ఐపీసీ మిరియాల శత్రయ్య డిస్టిక్ కో ఆర్డినేటర్ కందిబండ వాసంతి జెర్సీ లు సామా శ్రీనివాస్ రేపాల వేదశ్రీ జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ప్రెసిడెంట్ మా శెట్టి దివ్యశ్రీ సెక్రటరీ పారేపల్లి మాధవి శ్రీనివాస్ దంపతులు మిర్యాలగూడ కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ విశాలాక్షి కపుల్స్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ పురం చైతన్య నేరేడుచర్ల వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కొత్త లక్ష్మణ్ నేరేడుచర్ల వనిత క్లబ్ ప్రెసిడెంట్ వీరవెల్లి శ్రీలత తదితరులు పాల్గొన్నారు




