తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ఆధ్వర్యంలో ఈనెల 10.04.2023 సోమవారం రోజున లోకేశ్వర్ మండల కేంద్రంలో లోని ఎంపీడీవో కార్యాలయం నందు దివ్యాంగుల బస్సు పాస్ మేలను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని బైంసా డిపో మేనేజర్ ఎం అమృత తెలిపారు. మండల కేంద్రంలోని అర్హులైన దివ్యాంగులకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మరియు డీలక్స్ బస్సులో ప్రయాణంలో 50% రాయితీతో కూడిన బస్సు పాసు ఇవ్వడం జరుగుతుందని కావున అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు బస్ పాస్ కు కావాల్సిన పత్రాలు సదరం సర్టిఫికెట్ ఒరిజినల్ మరియు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు 50 రూపాయలు తీసుకొని వచ్చి బస్సు తీసుకో వెళ్లగలరని అన్నారు.




