ఘనంగా రాజ్యంగా దినోత్సవ వేడుకలు..
– త్వరలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు – ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం
హన్మకొండ బ్యూరో చీఫ్ 26 జనంసాక్షి
అసెంబ్లీలోని తన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…
డా,బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలమే నేటి తెలంగాణ రాష్ట్రమని ఆయన చూపిన తోవలోనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుందని ఈ సందర్భంగా చీఫ్ విప్ గుర్తు చేశారు…
త్వరలోనే 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అవిష్కరించుకోబోతున్నామని ఆయన అన్నారు..
73 ఏండ్లుగా భారత రాజ్యాంగం అధ్బుతంగా వర్ధిల్లితే గత కొన్ని రోజులుగా రాజ్యాంగ మనుగడను ప్రశ్నించే విధంగా ఢిల్లీ గద్దలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని ఆ గద్దల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలాని చీఫ్ విప్ విజ్ఞప్తి చేసారు…




