Saturday, 7 November 2026

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

హన్మకొండ బ్యూరో చీఫ్ 26 జనంసాక్షి

భారతదేశ రాజ్యాంగం యొక్క చరిత్ర ,ప్రాముఖ్యత,ఉపోద్గతం,రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

 

శనివారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరం లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని,భారత రాజ్యాంగ సభ 1949 లో నవంబర్ 26 వ తేదీన ఆమోదించిందని అన్నారు. భారత దేశంలో ని పౌరులం దరిలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 లో అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా నవంబర్ 26 ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి,ఆ సంవత్సరం నవంబర్ 19 న అధికారికంగా ప్రకటన విడుదల చేశారని అన్నారు.అప్పటి నుండి నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వివిధ శాఖల సిబ్బంది తో రాజ్యాంగ ఉపోద్గతం చదివించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి జిల్లా ఉన్నత అధికారులు , కలెక్టరేట్ వివిధ విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.