ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు”
ఫోటో రైటప్: ప్రతిజ్ఞ నిర్వహిస్తున్న అధికారులు
పెన్ పహాడ్. నవంబర్ 26 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారులు భారత రాజ్యాంగ ఆవశ్యకతను ఆవిర్భావం గురించి సిబ్బందికి వివరించారు. అదేవిధంగా మండల పరిధిలోని పొట్లపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ మండల విద్యాధికారి నకేరకంటి రవి ఎంపీ ఓ నరేష్ పంచాయతీరాజ్ ఏఈ గోపి ,ఏపీఓ రవి, మండల పారాలిగాలు వాలంటీర్ వ గ్గు సోమన్న, నారాయణ రామచంద్రారెడ్డి , సిబ్బంది ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు.




