విద్యతోనే జీవితానికి వెలుగు….
– ధరూర్ జెడ్పి హైస్కూల్ స్థల దాతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…
గద్వాల ప్రతినిధి నవంబర్ 27 (జనంసాక్షి):- గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థలదాత కుటుంబ సభ్యులు ధరూర్ మాజీ ఎంపిటీసి డి.ఆర్.శ్రీధర్ మంజుల,ప్రస్తుత ఎంపిటీసి మండలం పార్టీ అధ్యక్షుడు డి.ఆర్.విజయ్ కుమార్ శివలీల,బసవరాజు ల అధ్వర్యంలో భూ దాతలు కీ,,శే,, గాండ్ల రామలింగప్ప,డి.ఆర్ వీరప్ప గార్ల విగ్రహ ఆవిష్కరణ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగినది..ఎమ్మెల్యే మాట్లాడుతూ….అని దానలకన్న విద్యాదానం చాలా గొప్పదనాన్ని అన్నాడు.. ఆ మహనీయులు దూరదృష్టితో పాఠశాల కోసం ఇంత విలువైన స్థలాన్ని వితరణగా ఇవ్వడం చాలా గర్వకారణమన్నారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందిస్తూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థి చదువుకోవాలని దేశంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో విద్యార్థులకు అందజేస్తున్న కార్పొరేటర్ విద్య స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందని తెలిపారు..పాఠశాల అభివృద్ధి కోసం నావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ్, ఎంపిపి నజూమన్నీసా బేగం, జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి కేటీ దొడ్డి జెడ్పిటిసి రాజశేఖర్ , వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, ఎంపిటిసి లు శివలీల దౌలన్న, సర్పంచ్ పద్మమ్మ, మండలం పార్టీ అధ్యక్షుడు డిఆర్ విజయ్ కుమార్ ,
తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జాకీర్, సుధాకర్ రెడ్డి రాజ రెడ్డి వెంకటేష్ నాయుడు జములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ పరిమాల అంజి , మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్, స్థలదాత కుటుంబ సభ్యులు. లాజర్ తిమప్ప , రాములు, ఇదన్న, పెద్ద దేవన్న, శ్రీనివాసులు,శ్రీనివాసులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు…




